Genesis 2

1ఆకాశం, భూమి, వాటిలో ఉన్నవన్నీ పూర్తి అయ్యాయి. 2ఏడవ రోజు దేవుడు తాను చేసిన పని ముగించాడు. కాబట్టి తాను చేసిన పని అంతటి నుంచి ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. 3దేవుడు ఆ ఏడవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచి విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు.

4దేవుడైన యెహోవా భూమిని ఆకాశాన్ని చేసినప్పుడు, ఆకాశాల, భూమి విషయాలు ఈ విధంగా ఉన్నాయి, 5భూమి మీద అంతకుముందు ఆరుబయట ఏ పొదలూ లేవు, ఏ చెట్లూ మొలవలేదు. ఎందుకంటే దేవుడైన యెహోవా భూమిమీద వర్షం కురిపించలేదు. నేలని సేద్యం చెయ్యడానికి ఏ మనిషీ లేడు. 6కాని, భూమిలోనుంచి ఆవిరి లేచి నేలంతా తడిపేది.

7దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకొని మనిషిని చేసి అతని నాసికారంధ్రాలలో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది. 8దేవుడైన యెహోవా తూర్పువైపు ఏదెనులో ఒక తోటను చేసి తాను చేసిన మనిషిని దానిలో ఉంచాడు.

9దేవుడైన యెహోవా కనులకు అందమైన, ఆహారానికి మంచిదైన ప్రతి చెట్టునూ నేలలోనుంచి అక్కడ మొలిపించాడు. ఇంకా ఆ తోట మధ్యలో జీవవృక్షాన్నీ, ఏది మంచో, ఏది చెడో తెలిపే తెలివిని ఇచ్చే వృక్షాన్నీ కూడా నేలలోనుంచి మొలిపించాడు. 10ఆ తోటను తడపడానికి ఏదెనులో నుంచి ఒక నది బయలుదేరి అక్కడ నుంచి చీలిపోయి నాలుగు పాయలు అయ్యింది.

11మొదటిదాని పేరు పీషోను; అది బంగారం ఉన్న హవీలా దేశమంతటా ప్రవహిస్తున్నది. 12ఆ దేశంలో ఉన్న బంగారం ప్రశస్తమైనది. అక్కడ గుగ్గిలం, గోమేధిక మణులు కూడా దొరుకుతాయి.

13రెండో నది పేరు గీహోను. అది కూషు దేశమంతటా ప్రవహిస్తున్నది. 14మూడో నది పేరు హిద్దెకెలు. అది అష్షూరుకు తూర్పు వైపు ప్రవహిస్తున్నది. నాలుగో నది యూఫ్రటీసు.

15దేవుడైన యెహోవా ఏదెను తోట సేద్యం చెయ్యడానికీ దానిని చూసుకోడానికీ మనిషిని అక్కడ పెట్టాడు. 16దేవుడైన యెహోవా, <<ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలాన్నీ నువ్వు అభ్యంతరం లేకుండా తినొచ్చు, 17కాని, మంచి చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు వాటిని తిన్నరోజు కచ్చితంగా చచ్చిపోతావు>> అని మనిషికి ఆజ్ఞాపించాడు.

18దేవుడైన యెహోవా, <<మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సరిపడిన తోడును అతని కోసం చేస్తాను>> అనుకొన్నాడు. 19దేవుడైన యెహోవా, ప్రతి భూజంతువునూ ప్రతి పక్షినీ నేలలోనుంచి చేసి, ఆదాము వాటికి ఏ ఏ పేపేర్లు పెడతాడో చూడడానికి అతని దగ్గరకు వాటిని రప్పించాడు. జీవం ఉన్న ప్రతిదానికీ ఆదాము ఏ పేరు పెట్టాడో, ఆ పేరు దానికి ఖాయం అయ్యింది. 20అప్పుడు ఆదాము పశువులన్నిటికీ, ఆకాశపక్షులన్నిటికీ, భూజంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు. కాని ఆదాముకు మాత్రం సరిజోడు లేకపోయింది.

21అప్పుడు దేవుడైన యెహోవా ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు. అతడు నిద్రలో ఉండగా అతని పక్కటెముకల్లోనుంచి ఒకదాన్ని తీసి ఆ ఖాళీని మాంసంతో పూడ్చివేశాడు. 22ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుంచి తీసిన పక్కటెముకతో స్త్రీని తయారుచేసి ఆదాము దగ్గరకు తీసుకువచ్చాడు. 23ఆదాము, <<ఇప్పుడు ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. నరునిలోనుంచి బయటకు తీసినది గనుక ఈమె పేరు <నారి> >> అన్నాడు.

24ఆ కారణంగా పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి అతని భార్యతో ఏకం అవుతాడు. వాళ్ళు ఒకే శరీరం అవుతారు. అప్పుడు ఆదాము, అతని భార్య ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. వాళ్ళకు సిగ్గు తెలియదు.

25

Copyright information for TelULB